తెలంగాణ,కరీంనగర్,మెదక్, ఫిబ్రవరి 12 -- తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఉత్తర తెలంగాణ పరిధిలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి. దూకుడుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మరోవైపు బీజేపీ సైతం అంజిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది.

ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం అందరికంటే ముందే బీజేపీ అభ్యర్థిని ప్రకటించి. ప్రచారాన్ని కూడా షురూ చేసింది. ఈ ఎన్నికల్లో తమదే విజయమని చెబుతోంది. అయితే కాంగ్రెస్ నుంచి ఒక్కరిద్దరూ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ.. చివరగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావటంతో నరేందర్ రెడ్డి. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధ...