తెలంగాణ,కరీంనగర్, ఫిబ్రవరి 13 -- ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రులు, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్ లో ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో నిలిచిన వారి సంఖ్య తేలింది. పట్టభద్రుల స్థానానికి 12 మంది, టీచర్ల స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

పట్టభద్రుల స్థానానికి 100 మంది నామినేషన్ దాఖలు చేయక 32 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 56 మంది బరిలో నిలిచారు. పట్టభద్రుల స్థానంలో పది మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కాగ 46 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా అంజిరెడ్డి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీం...