తెలంగామ,కరీంనగర్, జనవరి 30 -- ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాల పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల నాగారా మ్రోగింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. మార్చి 29 తో ప్రస్తుతం ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు.

మూడు నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న నామినేషన్లను పరిశీలించి, ఉపసంహరణకు ఫిబ్రవరి 13 వరకు గడువు ఇచ్చారు.‌ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడుతారు.

కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ప్రస్తుతం 3లక్షల 41 వేల 313మంది పట్టభద్రుల ఓటర్లు... 25 వేల 921 మంది టీచర్స్ ఓటర్లు ఉన్నారు. ఇటీవల కొత్తగా ఓ...