భారతదేశం, ఫిబ్రవరి 25 -- సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండి కూడా మూడు స్థానాల్లో పోటీ చేసే ధైర్యం చేయలేదన్నారు. ఒక్క స్థానంలోనే పోటీ చేస్తున్నా.. ఆ స్థానాన్ని కూడా బీజేపీయే గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

'బీజేపీ పోటీ చేస్తున్న మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం తిడితే.. ఆదరాబాదరాగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో కూడా ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడారు. తలా తోక లేకుండా మాట్లాడారు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారో.. ఏం మాట్లాడుతున్నారో.. ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎన్నికలు జరగక ముందే ఓడిపోతున్నామనే నిరాశ, ...