భారతదేశం, మార్చి 9 -- TG Mlc Elections : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో అభ్యర్థుల ఖరారుపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌, శంకర్‌ నాయక్‌, విజయశాంతి పేర్లను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఖరారు చేశారు. పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ... అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటించింది. అనూహ్యంగా విజయశాంతి పేరును ఖరారు చేయడంతో ఆసక్తికరంగా మారింది. విజయశాంతి పేరు పరిగణనలో ఉన్నట్టు ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు రాలేదు. ఊహించని విధంగా విజయశాంతి పేరు తెర పైకి రావడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం క...