భారతదేశం, మార్చి 3 -- తెలంగాణలో 5 శాసన మండలి స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేది మార్చి 10గా నిర్ణయించారు. మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు విధించారు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 20న సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉంటుంది.

అసెంబ్లీలో సంఖ్యా బలం ప్రకారం.. కాంగ్రెస్‌కు నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఒకటి దక్కే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ విషయం అటుంచితే.. కాంగ్రెస్‌లో పోటీ ఎక్కువగా ఉంది. కాంగ్రెస్‌కు దక్కే ఎమ్మెల్సీల్లో ఒక్కొక్కటి కావాలంటూ మిత్రపక్షాలు సీపీఐ, ఎంఐఎం కోరుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి అద్దంకి దయా...