భారతదేశం, ఫిబ్రవరి 23 -- బీసీ వర్గాల్లో చైతన్యం వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బీసీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్న ఈటల.. ఉద్యోగులు, నిరుద్యోగులపక్షాన బీజేపీ పోరాటం చేసిందని గుర్తు చేశారు. కొందరు ఓటమి భయంతో సోషల్‌ మీడియాలో.. బీజేపీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

'కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27వ తారీఖున జరగబోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అడ్రస్ లేని ఫేక్ పేపర్లలో.. అడ్రస్ లేని ఫేక్ అకౌంట్లలో.. సోషల్ మీడియాలో.. అనేక రకాల విషప్రచారాలు చేస్తున్నారు. టీచర్లు, గ్రాడ్యుయేట్లు చాలా విజ్ఞులు. అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచార...