భారతదేశం, ఫిబ్రవరి 15 -- తెలంగాణలో గతంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో చదువుకున్న వారు కూడా ఓటింగ్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నెల 27న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒకటికి రెండు సార్లు ఓటు వేసే విషయంలో అవగాహనను పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాణాల ప్రకారం నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్య క్రమంలో ఓటేయాలని స్పష్టం చేస్తున్నారు.

బ్యాలెట్‌ పత్రంలో పోలింగ్‌ సిబ్బంది ఇచ్చే వాయిలెట్‌ రంగు స్కెచ్‌ పెన్నుతోనే ఓటు వెయ్యాలి. వేరే పెన్ను, పెన్సిల్‌ను ఉపయోగించొద్దు. టిక్‌ పెట్టడం, ఓకే అనే అక్షరాలు కూడా రాయకూడదు.

మొదటి ప్రాధాన్యత ఇవ్వదలచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బ్రాకెట్‌లో 1 నంబర్ వేయాలి. అంకె వేయకుండా 2, 3, ...