భారతదేశం, ఫిబ్రవరి 1 -- TG Mlc Elections : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం వికసించేనా? కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? అంటే రెండు అధికార పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నిక సవాల్ గానే మారింది. పట్టభద్రుల స్థానం నుంచి ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థులను కాంగ్రెస్, బీజేపీ బరిలోకి దింపగా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండేందుకు సిద్ధమయ్యింది. డజన్ మందికి పైగా స్వతంత్రులు పోటీకి సిద్ధమైన తరుణంలో అధికార పార్టీలకు ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.

ఉత్తర తెలంగాణలో కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అధికార పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు పోటీకి ఆసక్తి చూపుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఫిబ్రవరి 3న నోట...