భారతదేశం, జనవరి 29 -- TG Mlc Elections : వచ్చే నెల 27వ తేదీన జరిగే కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా వై. అశోక్ కుమార్ ను ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు దశబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా పని చేసిన అశోక్ కుమార్ 2024లో పదవీ విరమణ పొందారు.

'హక్కులకై కలబడు- బాధ్యతలకు నిలబడు' అన్న నినాదంతో పనిచేస్తూ, స్వతంత్రంగానూ ఐక్య ఉద్యమ వేదికల ద్వారా విద్యారంగ అభివృద్ధికి,

ఉపాధ్యాయుల, అధ్యాపకుల సంక్షేమానికి టీపీటీఎఫ్ కృషి చేస్తుందని ఆ సంస్థ నాయకులు అంటున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ముందు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ భావజాలానికి పురుడుపోసిన సంస్థ టీపీటీఎఫ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అశోక్ కుమార్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించామన్నా...