భారతదేశం, ఫిబ్రవరి 1 -- TG Mlc Elections : మెదక్- కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని, లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ ఆదేశాలిచ్చారు.

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న తుపాకులను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 8 లోపు డిపాజిట్ చేయాలని సీపీ ఆదేశించారు. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం తీసుకొని వెళ్లవచ్చన్నారు. తుపాకులు డిపాజిట్ చేయని వారిపై ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ప్రజలు, ప్రజా ప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని సూచించా...