భారతదేశం, ఫిబ్రవరి 27 -- TG Mlc Elections: ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

15 జిల్లాల పరిధిలో 3 లక్షల 55 వేల 159 మంది పట్టభద్రుల ఓటర్లు, 27088 మంది టీచర్ ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల కోసం 499, టీచర్ల కోసం 274 మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో టీచర్, పట్టభద్రుల రెండు ఓట్లు ఉన్న వారి కోసం ఒకే చోట ఓటు వేసేలా 93 కామన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ తో పాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు కంట్రోల్ రూమ్ నుండి నిరంతర ప...