భారతదేశం, మార్చి 6 -- TG Mlc Elections: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో రికార్డు సృష్టించామని, కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలయిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు ఓటమిని రంజాన్ గిఫ్ట్ గా ఇస్తున్నాం...పండుగ చేసుకొమన్నారు. తెలంగాణలో 70 శాతం బీజేపీదేనని త్వరలో 100 శాతం సాధిస్తాని స్పష్టం చేశారు.

ఉత్తర తెలంగాణలో ఉత్కంఠగా రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీని బీజేపీ కైవసం చేసుకుంది. మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరకు బిజేపినే విజయం వరించింది.‌

రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుపుకు కావాల్సిన కోటా ఓట్లు రానప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కంటే 5 వేల పై చిలుకు ఓట్ల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉన్న బిజెపి అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ని విజేత గా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమే...