భారతదేశం, ఫిబ్రవరి 28 -- TG Mlc Elections: ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల తీర్పు మార్చి 3న వెలువడనుంది. బ్యాలెట్ బాక్సుల్ని కట్టుదిట్టమైన భద్రత మద్య కరీంనగర్ ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడుతారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రతిష్టాత్మకంగా భావించిన ఉత్తర తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

ఓటర్లుగా ఉన్న పట్టభద్రులు, టీచర్ లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు బరిలో నిలువగా 70.42 శాతం పోలింగ్ నమోదైంది.

15 జిల్లాల పరిధిలో 355159 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా 250103 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా టీచర్ల ఎ...