భారతదేశం, ఫిబ్రవరి 12 -- TG Mlc Elections: ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. సరైన ఫార్మాట్ లో నామినేషన్ పత్రాలు నింపక పోవడంతో 32 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. నామినేషన్ల స్క్రూటీని పూర్తి కావడంతో 12, 13 తేదీల్లో నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది.

ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్స్ రెండు ఎమ్మెల్సీ నామినేషన్ లో 33 మంది నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం కలకలం సృష్టిస్తుంది. పట్టభద్రుల స్థానానికి 100 మంది నామినేషన్ దాఖలు చేశారు.‌ అందులో 32 మంది నామినేషన్లు తిరస్కరించారు. సరైన ఫార్మాట్ లో పూర్తి వివరాలతో దాఖలు చేసిన వాటిని అమోదించామని ఎన్నికల అధికారులు తెలిపారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛై...