భారతదేశం, మార్చి 5 -- TG Mlc Election Results : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ టీచర్ స్థానంతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీని బీజేపీ కైవసం చేసుకుంది. మూడు రోజుల పాటు సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విజయం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని వరించింది. మొత్తం 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అంజిరెడ్డి 97,880 ఓట్లు రాగా, 5 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాలను అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విజేతను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....