భారతదేశం, ఫిబ్రవరి 3 -- TG Mlc Election Nominations : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ల స్థానానికి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు.‌ టీచర్స్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తో పాటు తొమ్మిది మంది 13 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 8, 9 తేదీల్లో నామినేషన్లకు సెలవు ఉంటుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు.

ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. కరీంనగర్ కలెక్టరేట్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నామినేషన్లు స్వీకరిస్తున్నారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కరీంనగర్ కల...