కరీంనగర్,తెలంగాణ, ఫిబ్రవరి 1 -- ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం హీటెక్కుతుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పక్షం రోజుల క్రితం బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి కి చెందిన మాల్క కొమరయ్య లను ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కరీంనగర్ కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డిని ఎంపిక చేశారు.

కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా వి.నరేందర్ రెడ్డి పేరు ఖరారు కావడంతో కాంగ్రెస్ తో పాటు నరేందర్ రెడ్డి కుటుంబసభ్యుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి.‌ నరేందర్ రెడ్డిని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు అభినందించి శుభాకాంక్షలు తె...