భారతదేశం, ఫిబ్రవరి 15 -- TG Mlc Election : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈనెల 27న జరగనున్న కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు తగిన ఏర్పాట్లతో పాటు పీఓలు ఏపీవోలకు శిక్షణ ఇస్తున్నారు. ఎలాంటి పొరపాటు లేకుండా ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఓవైపు రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తే, అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసి బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరో తేలారు. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానానికి 56 మంది టీచర్ల స్థానానికి 15 మంది పోటీ చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థులకు సీరియల్ నంబర్స్ క...