భారతదేశం, మార్చి 11 -- రాములమ్మ మళ్లీ రంగంలోకి దిగింది. అద్దంకి దయాకర్‌కు అడ్డే లేదనే టాక్ వినిపిస్తోంది. ఇటు దాసోజు శ్రవణ్ కంచు కంఠాన్ని తట్టుకోవడం కష్టమే అనే చర్చ జరుగుతోంది. అవును.. ఈ ముగ్గరు తెలంగాణ ఉద్యమంలో తమదైన శైలిలో పోరాటం చేసి.. ప్రజాదరణ పొందారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థిత్వాన్ని సాధించారు. విజయశాంతి, అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే.. దాసోజు శ్రవణ్.. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతున్నారు. వీరు మండలిలోకి అడుగు పెట్టడం దాదాపు ఖాయమైంది.

రాములమ్మ.. తెలంగాణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడిన నాయకురాలు. కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నడుం బిగించారు. పార్లమెంట్‌లో పోరాడారు. తెలంగాణ గళాన్ని గట్టిగా వినిపించారు. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి.. ఉద్...