తెలంగాణ,ఢిల్లీ, ఏప్రిల్ 2 -- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నాలుగేళ్లు స్పీకర్‌ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని ప్రశ్నించింది.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా తగిన స్పీకర్ చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టులో ఇటీవల బీఆర్ఎస్ నేతలు పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై గత వారమే వాదనలు ముగిశాయి. ఇవాళ స్పీకర్‌ తరఫున మకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. పలు అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వే...