భారతదేశం, మార్చి 23 -- తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ పిటిషన్‌పై ఈ నెల 22లోగా స్పందించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది.

తెలంగాణలో ఇటీవల చోటుచేసుకున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం, దీనిపై బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో ఇప...