తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 28 -- తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. మార్చి 29 నాటికి మండలిలో ఐదు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీరిలో మహమూద్‌ అలీ,ఎగ్గె మల్లేశం, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌రెడ్డి, మీర్జా రియాజుల్‌ హాసన్‌ ఉన్నారు. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు మార్చి 20వ తేదీన పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రావటంతో...అధికార కాంగ్రెస్ లోని పలువురు నేతలు ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సంఖ్యా బలం పరంగా చూస్తే... కాంగ్రెస్ తో పాటు వారి మిత్రపక్షాలను కలుపుకొని నాలుగు సీట్లు కూడా వారి ఖాతాలోకే వెళ్లే అవకాశం ఉంది. ఇక ఒక సీటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు దక్కే అవకాశం ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి రావటంతో హస్తం పార్టీలోని నేతలు... ఎమ్మెల్...