భారతదేశం, ఏప్రిల్ 5 -- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 86 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయుధాలు విడిచిపెట్టిన వారిలో 20 మంది మహిళలు ఉన్నారు. చాలా కాలంగా మావోయిస్టు ప్రభావితమైన ఈ ప్రాంతంలో.. శాంతి, సాధారణ స్థితిని తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఈ లొంగుబాటును ఒక ప్రధాన ముందడుగుగా భావిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

మావోయిస్టులు లొంగిపోవడాన్ని పోలీసు అధికారులు స్వాగతించారు. లొంగిపోయిన వ్యక్తులకు ప్రభుత్వం అందించే పునరావాసం సాయాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వారికి సహాయం చేయడంలో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. హింసకు బదులుగా శాంతి, అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నందుకు లొంగిపోయిన మావోయిస్టులు, ముఖ్యంగా మహిళల ధైర్యాన్ని జిల్లా పోలీసులు ప్రశంసించారు.

1.ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు సీరియస్‌గా ప్రయత్ని...