భారతదేశం, ఏప్రిల్ 8 -- సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఓ లేఖ విడుదల అయ్యింది. షికారు పేరుతో కర్రిగుట్ట పైకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని అందులో మావోయిస్టులు స్పష్టం చేశారు. మావోయిస్టులు విడుదల చేసిన ఈ లేఖ సంచలనంగా మారింది. స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది.

పోలీసులు డబ్బులు ఇస్తూ.. మాయ మాటలు చెప్పి నమ్మిస్తారని, అమాయకులను ఇన్ ఫార్మర్‌గా మార్చుకుంటారని సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం - వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత లేఖలో పేర్కొన్నారు. పోలీసుల మాటలు నమ్మి ఎవరూ ఇన్ ఫార్మర్లుగా మారవద్దని సూచించారు. ఇన్ ఫార్మర్లుగా మారి కుటుంబాలను కష్టాలపాలు చేయకండని హితవు పలికారు. మాయ మాటలు చెప్పే పోలీసుల మాటలు నమ్మి.. వారి వలలో పడి కర్రిగుట్టపైకి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.

బహుళ జాతి కంపె...