భారతదేశం, మార్చి 6 -- అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరణకు మంచి స్పందన వస్తోంది. చాలామంది ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఫీజులు చెల్లిస్తున్నారు. అయితే.. కారణాలు ఏంటో తెలియదు కానీ.. ఎల్ఆర్ఎస్‌కు సంబంధించి.. సాఫ్ట్‌వేర్‌ కష్టాలు మొదలయ్యాయి. అకస్మాత్తుగా డేటా మాయం కావడం.. కాసేపటి తర్వాత మళ్లీ ప్రత్యక్షం కావడం లాంటి పరిస్థితి ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. సాంకేతిక ఇబ్బందులు వల్ల ప్రక్రియ వేగంగా ముందుకు వెళ్లడం లేదని అంటున్నారు.

ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు సంబంధించి సెంటర్‌ ఫర్‌ గుడ్‌గవర్నర్స్‌ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. తాజాగా తలెత్తిన లోపాలను సరిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిగా పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఇటు హెచ్‌ఎండీఏలోని ఆరు జోన్ల పరిధిలో 3.2 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం 10వే...