తెలంగాణ,హైదరాబాద్, మార్చి 30 -- ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు ప్రక్రియలో వేగం పెరిగింది. ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు దరఖాస్తుదారులు ఆసక్తి చూపుతున్నారు. మార్చి 31వ తేదీలోపు ఫీజు చెల్లించినవారికి మాత్రమే 25 శాతం రాయితీ వర్తించనుంది. దీంతో చాలా మంది అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే ఈ గడువు రేపటితో పూర్తవున్న నేపథ్యంలో... మిగిలినవారు కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుల ప్రక్రియ నడుస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31న సెలవుగా ప్రకటించినప్పటికీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపింది. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని వివరించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని... ఆలస్యం ...