తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 8 -- స్థానిక ఎన్నికల సమరానికి తెలంగాణ సిద్ధం కాబోతుంది..! ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా ప్రకటన రానుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే షెడ్యూల్ వెల్లడయ్యే సూచనలు ఉన్నాయి.

స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బంది శిక్షణ, ఎన్నికల నిర్వహణ విషయంలో పక్కా ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో పడింది. ఇదే విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడ్డాయి.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ. ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. క...