తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 14 -- రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరానికి బ్రేకులు పడినట్లు అయింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని అంతా భావించారు. ఈ ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికల నిర్వహణ తప్పనిసరిగా ఉంటుందని అనుకున్నప్పటికీ. చివరి నిమిషంలో సీన్ మారిపోయింది. కుల గణనపై మరోసారి ప్రభుత్వం ప్రకటన చేయటంతో. ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.

ఈనెల 15వ తేదీలోపు రిజర్వేషన్ల ఖరారు తో పాటు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ జోరుగా జరిగింది. అయితే కుల గణన విషయంలో వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం... బుధవారం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మరోసారి కుల గణన సర్వే చేపడుతామని తెలిపింది. ఫిబ్రవరి 28 వరకు సర్వే సిబ్బందికి వివరాలు అందజేయవచ్చని పేర్కొంది. ఎవరైతే సర్వేలో పాల్గొన...