భారతదేశం, ఫిబ్రవరి 1 -- పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 3 విడతల్లో నిర్వహిస్తే సిబ్బంది కొరత ఉండదని అధికారులు చెబుతుండగా.. అలా చేస్తే సమయం వృథా అవుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇతర శాఖల సిబ్బందిని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో జరిగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పంచాయతీ ఎన్నికల నగారా ఎప్పుడైనా మోగించవచ్చన్న సంకేతాలతో.. అధికారులు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓటరు జాబితాను గ్రామాలు, వార్డుల వారీగా సిద్ధం చేశారు. ఒక వైపు కొత్త ఓటర్ల పేర్లను వార్డుల వారీగా నమోదు చేస్తుండగా.. మరోవైపు ఓటరు బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు కసరత్తు ప్...