తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 21 -- లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవలనే కీలక నిర్ణయం తీసుకోగా.. తాజాగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనుంది. అయితే మార్చి 31లోగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించిన వారికి మాత్రమే ఈ రాయితీ నిర్ణయం వరిస్తుంది. ఇదే విషయాన్ని ఉత్తర్వుల్లో కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఉన్న నిబంధనల్లో పలు మార్పులు తీసుకువచ్చింది.

ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో తీసుకువచ్చిన తాజా మార్పులతో చాలా మంది భూయాజమానులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం రానుంది. అయితే ఈ స్కీమ్ లో తాజాగా తీసుకువచ్చిన మార్పులు, కటాఫ్ తేదీ వివరాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూడండి..

Published by HT ...