భారతదేశం, జనవరి 28 -- న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ - 2026 షెడ్యూల్ విడుదలైంది. 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

ఇంటర్‌ విద్యార్హతతో 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

టీజీ లాసెట్ - 2026కు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీ వరకు ఫైన్ తో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. మే 18వ తేదీన మూడేళ్ల ఎల్ఎల్ బీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం 09. 30 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్న...