భారతదేశం, ఫిబ్రవరి 8 -- రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

ఇంటర్‌ విద్యార్హతతో 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టీజీ లాసెట్ - 2026లో అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.

టీజీ లాసెట్ - 2026కు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీ వరకు ఫైన్ తో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అప్లికేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900...