తెలంగాణ,హైదరాబాద్, మార్చి 16 -- తెలంగాణలోని న్యాయ కళాశాల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతి ఏడాది లాసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి కూడా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే నోటిఫికేషన్ రాగా. ఆన్ లైన్ లో అప్లికేషన్లను కూడా స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఏప్రిల్ 25 వరకు రూ.500 జరిమానా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మే 5 వరకు రూ. 1,000 ఆలస్యం రుసం, మే 15 వరకు రూ.2,000, మే 25 వరకు రూ.4,000 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20 - 25 తేదీల మధ్య ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. జూన్ 6వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సుల ప్రవేశ పరీక్ష, మద్య...