భారతదేశం, మార్చి 10 -- TG Land Survey: తెలంగాణలో భూమి గట్లు జరుపుతూ పక్క రైతుల భూములను కలుపుకోవడం. గతంలో నాటిన హద్దులను జరిపి ఇబ్బందులకు గురిచేసే వితండ వాదులకు శుభం కార్డు పడనుంది. హద్దులు, భూ రికార్డుల సమస్య లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. గత ప్రభుత్వంలోనే భూ సర్వేకు అడుగులు పడగా అంతలోనే ఆగిపోయింది.

తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ సర్వేకు ప్రాధాన్యతనిస్తుండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. భూ రికార్డులను సిద్ధంగా ఉంచాలన్న ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తదనుగుణ చర్యలు చేపట్టారు. భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు సబ్ డివిజన్లు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇదే జరిగితే నిత్యం భూ సమస్యలు, రికార్డుల కొరకు కార్యాలయాల చుట్టు తిరిగే రైతన్నకు ఇక తిప్పలు ఉండవు.

సాగు భూములతో పాటు నివాస స్థలాలను స...