భారతదేశం, డిసెంబర్ 7 -- తెలంగాణలో 7 నూతన జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో కొత్తగా జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణకు 7 కొత్తవి కేటాయించడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు.

తెలంగాణ‌లో నిజమాబాద్‌, కొత్త‌గూడెం భద్రాద్రి, జ‌గిత్యాల‌, మేడ్చేల్ మ‌ల్కాజ్‌గిరి, మ‌హ‌బుబ్‌న‌గ‌ర్‌, సూర్య‌పేట, సంగారెడ్డిలో కొత్తగా న‌వోద‌య విద్యాల‌యాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. కరీంనగర్, ఖమ్మం, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, నల్గొండ, కామారెడ్డి, రంగారెడ్డి, వరంగల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌లో ఇప్పటికే జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.

దాదాపు 30 ఏళ్ల కిందట తెలంగాణ ప్రాంతంలో 1986-87లో రెండు విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ...