భారతదేశం, జనవరి 28 -- TG Intermediate Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ప్రశ్నా పత్రాలను మార్చాలని ఇంటర్ బోర్డు ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ప్రశ్నాపత్రాల విధానంలో మార్పులు చేస్తే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇంటర్‌ బోర్డు స్పష్టమైన ప్రకటన చేస్తుంది. దానికి భిన్నంగా పరీక్షలకు ముందు ప్రశ్నాపత్రం మార్చాలనుకోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

ఇంటర్ వార్షిక పరీక్షలకు మరో నెలన్న మాత్రమే గడువు ఉండగా ఇంటర్ ఫస్టియర్‌ ఇంగ్లీష్‌ ప్రశ్నపత్రాల నమూనాలో మార్పు చేస్తున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు ఇటీవల ప్రకటించింది. ఇప్పటి వరకు ఇంగ్లీష్ సబ్జెక్టులో మూడు సెక్షన్లుగా... 16 ప్రశ్నలు ఉండేవి.

ఈ ఏడాది మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలో ఒక ప్రశ్నను అదనంగా చేరుస్తున్నట్టు బోర్డు ప్...