భారతదేశం, మార్చి 22 -- తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల భవితవ్యం తేల్చే జవాబుపత్రాల మూల్యాంకనం.. ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. నెల రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. వాల్యుయేషన్ కోసం ఇంటర్‌ బోర్డు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా మూల్యాంకనం ప్రక్రియ చేపట్టనున్నారు. మార్కుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత.. ఫలితాలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 14 వేలమంది సుమారు 60 లక్షల జవాబుపత్రాలను దిద్దాల్సి ఉంటుంది.

2.సమాధాన పత్రాలను పలు స్థాయిల్లో పరిశీలిస్తారు. ఆ తర్వాతే మార్కులను ఖరారు చేస్తారు. రోజుకు ఒక్కో అధ్యాపకుడు 40 సమాధాన పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. వారిని అసిస్ట...