భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణ ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఫలితాలను విడుదల చేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణాదిత్యలతో కలిసి ఫలితాలను మంత్రి భట్టి విడుదల చేశారు.

తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షలకు 9,97,012 మంది హాజరయ్యారు. 66.89 శాతం మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌ 71.3 శాతం ఉత్తీర్ణలయ్యారు. మొదటి ఏడాది పరీక్ష, 4,88, 438మంది బాలికలు 73.8శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో బాలురు 57.83శాతం ఉత్తీర్ణులయ్యరు.

రెండ ఏడాది 5,08,582మంది హాజరయ్యారు. వీరిలో బాలికలు 74.21శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాది 57.31 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించిన సి...