భారతదేశం, ఫిబ్రవరి 15 -- హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో దాదాపు 150 వరకు ప్రైవేటు, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ రెసిడెన్షియల్‌ విధానంలోనే నడుస్తున్నాయి. చాలా కాలేజీల్లో సిబ్బంది చదువు పేరుతో విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. దూషిస్తూ కొడుతున్నారని విద్యార్థులు వాపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు మధ్యలోనే ఇంటికి వచ్చేస్తున్నారు. మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ రెండు నెలల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగించే అంశం. బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నా.. సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

చాలా కాలేజీలు తమ విద్యా సంస్థలకు పేరు రావడానికి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ...