భారతదేశం, ఏప్రిల్ 6 -- తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబీఐఈ).. 2025 సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏప్రిల్ చివరి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం 9 లక్షల 96 వేల 971 మంది పరీక్షలు రాశారు. వారు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు ప్రకటించాక.. థర్డ్ పార్టీ ఏజెన్సీలు కూడా ఫలితాలను అందుబాటులో ఉంచుతాయి. గత సంవత్సరం ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24న ప్రకటించారు. 2023కి సంబంధించి ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. 2022లో జూన్ 28న ఫలితాలను ప్రకటించారు. అదేవిధంగా 2021లో కూడా జూన్ 28న ఫలితాలను విడుదల చేశారు. 2020లో జూన్ 18న ప్రకటించారు.

1.ఫస్ట్ సెకెండ్ ...