భారతదేశం, ఏప్రిల్ 9 -- TG Inter Project SERVE : ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రాజెక్ట్ సర్వ్ పేరిట కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ పై తొలి ఆన్లైన్ సెషన్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లోని రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు చెందిన విద్యార్థులతో పైలట్ ప్రాజెక్టుగా ఇంటర్ బోర్డు ప్రారంభించింది.

ఏక్ స్టెప్ ఫౌండేషన్ భాగస్వామ్యంగా నిర్వహించబడిన ప్రాజెక్ట్ SERVE లో అన్ని ప్రభుత్వ జూనియర్, వృత్తి విద్యా కాలేజీలలో విద్యా నాణ్యతను ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా మెరుగుపర్చడానికి ఉద్దేశించిన ఒక కొత్త ఆలోచన. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ SERVE కోఆర్డినేటర్ గోపాల బాల సుబ్రహ్మణ్యంతో పాటు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య, కమ్యూనికేషన్ స్కిల్ నిపుణుడు వరప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇంటర్మీడియట్...