భారతదేశం, జనవరి 2 -- తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. తల్లిదండ్రుల వాట్సప్‌ నెంబర్ కు విద్యార్థుల హాల్‌టికెట్లను పంపనున్నారు. హాల్‌టికెట్‌ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామాతో పాటు ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో తల్లిదండ్రులకు తెలియజెప్పడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.

సెకండ్ ఇయర్ హాల్ టికెట్లలో ఫస్ట్ ఇయర్ మార్కుల లింక్ కూడా ఇస్తారు. ఫలితంగా సదరు విద్యార్థి ఫస్ట్ ఇయర్ లో తప్పిన(ఫెయిల్) పరీక్ష వివరాలు కూడా కనిపిస్తాయి. ఫలితంగా తల్లిదండ్రులకు కూడా ఓ అంచనా ఉండనుంది. ఈ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

ఇక హాల్ టికెట్లలో ఏమైనా తప్పులుంటే కాలేజీలను సంప్రదింవచ్చని కూడా ఇంటర్ బోర్డు సూచించింది. లేదా నోడల్ అధికారులను కూడా కలవొచ్చని పేర్కొంది. ...