భారతదేశం, డిసెంబర్ 24 -- తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షలపై ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల ఆలస్య రుసుంతో ఈ నెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

గత అక్టోబరులో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆలస్య రుసుం గడువు ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దీంతో ఈ గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించారు. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని ఇంటర్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

ఇక ఫైన్ కాకుండా ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ. 530 చెల్లించాలి. ప్రాక్టికల్ పరీక్ష కోసం రూ. 100 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు రూ. 870 చెల్లించాలి. సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ. 530 చెల్లించాలి. ఇంగ్లీష్ ప్రాక్టికల్ కోసం రూ. 100, జనరల్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల కోసం రూ. 870 చె...