భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణ ఇంటర్ పరీక్షల టైం టేబుల్ లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 3వ తేదీన నిర్వహించాల్సిన ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ మ్యాథమెటిక్స్‌-2ఏ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలను మార్చి 4వ తేదీ నిర్వహించనున్నారు. మిగతా పరీక్షలు మాత్రం పాత షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని స్పష్టం చేశారు.

మార్చి 3వ తేదీన హోలీ పండుగ రానుంది. ఆ రోజు సెలవు దినం ఉండటంతో... ఎగ్జామ్ షెడ్యూల్ లో మార్పు చేశారు. మార్చి 3వ తేదీన కాకుండా... 4వ తేదీన నిర్వహించనున్నారు.మిగతా పరీక్షలన్నీ యథాతథంగా జరుగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి.రాష్ట్ర...