భారతదేశం, మార్చి 3 -- TG Inter Exams 2025 : తెలంగాణలో మార్చి 5 నుంచి మార్చి 25 వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇంటర్ పరీక్షలను ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,532 కేంద్రాలలో మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. ఇంటర్ పరీక్షలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించడానికి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లతో సహా 1,532 మంది పరీక్షా సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.

అన్ని పరీక్షా కేంద్రాలకు రవాణా సదుపాయాలు, తాగునీరు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్...