భారతదేశం, మార్చి 3 -- తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం అయ్యింది. ఎల్లుండి నుంచి ఈ నెల 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. 29,992మంది ఇన్విజిలేటర్లు, 72ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. 124 సిట్టింగ్ స్క్వాడ్స్‌తో పర్యవేక్షణ ఉండనుంది. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

పరీక్షలకు సంబంధించి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ కోసం ఇంటర్‌ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. మొదట కాలేజీల లాగిన్‌లలో ఉంచిన అధికారులు.. తాజాగా ఫస్ట్, సెకెండ్ ఇంటర్‌తో పాటు బ్రిడ్జి కోర్సు పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి డౌన్...