భారతదేశం, జనవరి 29 -- TG Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి అధ్యయన కమిటీని నియమించారు. ఈ కమిటీ వారం రోజుల్లోగా తమ అధ్యయనాన్ని పూర్తి చేసి సమగ్ర విధివిధానాలతో నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యద‌ర్శి రామ‌కృష్ణారావు, గ‌నుల శాఖ ముఖ్య కార్యద‌ర్శి ఎన్‌.శ్రీ‌ధ‌ర్‌, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ క‌మిష‌న‌ర్ శ‌శాంక‌, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌తో కమిటీని నియ‌మించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా.. గనుల శాఖపై సీఎం సచివాలయంలో మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతి కుమారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభించనున్న...