భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు తీసుకున్న లబ్ధిదారులు.. వెంటనే పనులు ప్రారంభించాలని.. కలెక్టర్ మనుచౌదరి స్పష్టం చేశారు. జనవరి 26వ తేదిన మండలాల వారిగా ఎంపిక చేసిన గ్రామాల్లో.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేశామని చెప్పారు. 2,543 మందికి ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఎంపీడీవోల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శలు, ఇతర అధికారులు లబ్ధిదారులతో మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. వారికి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల స్థలంలో ఇంజినీరింగ్ అధికారులు మాడల్ హౌస్‌లను చూపించాలని సూచించారు. సందేహాలు నివృత్తి చేసి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.

పనుల ఆధారంగా ఇంజినీరింగ్ అధికారులు ఎంబీలు రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయాలని కలెక...