భారతదేశం, మార్చి 7 -- ఈ ఏడాది జనవరి 26న రాష్ట్రంలోని మండలానికి ఒక గ్రామం చొప్పున.. మొత్తం 562 పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో 72 వేల 45 మందికి ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి.. మిగిలిన ఊర్లలో అర్హుల ఎంపికపై దృష్టి సారించారు.

తాజాగా ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికలో భాగంగా.. గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ద్వారా గతంలోనే దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేశారు. దరఖాస్తుదారులను ఎల్‌-1 (సొంత స్థలాలు ఉన్నవారు), ఎల్‌-2 (సొంత స్థలం, ఇల్లు లేని వారు), ఎల్‌-3 (ఇ...